ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ముస్సోరీ నుంచి - డెహ్రాడూన్ వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. బస్సు డ్రైవర్‌తో సహా 22 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి వచ్చిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాపాడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముస్సోరి నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. శేర్ ఘాటీ దగ్గరకు రాగానా అదుపు తప్పి 150 అడుగుల లోతులో పడింది. ఇంకా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు.