ముదిరాజ్​ల చైతన్యమే లక్ష్యం

  • తొలివిడత బస్సు యాత్ర ప్రారంభం

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముదిరాజ్​ల చైతన్యమే లక్ష్యంగా ఆ కుల సంఘం నేతలు ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్​లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి శనివారం బస్సు యాత్రను ప్రారంభించారు. శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో మొదటి విడతలో ఈ బస్సు యాత్ర హైదరాబాద్ , రంగారెడ్డి , మహబూబ్ నగర్ , మెదక్ , కరీంనగర్ జిల్లాలో చేపడుతున్నట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు.  జనాభా దామాషా ప్రకారం స్థానిక ఎన్నికల్లో ముదిరాజ్​లకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.