బైపాస్​పై బస్సులు నిలపొద్దు

భిక్కనూరు, వెలుగు : ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో బైపాస్​ రోడ్డుపై ఆర్టీసీ బస్సులు నిలపొద్దని ప్రయాణికులు కోరుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో మహిళలు భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. దీంతో అడిగిన చోట్లా బస్సులను ఆపుతున్నారు.ఈ క్రమంలోనే మండలంలోని బీటీఎస్​ చౌరస్తాలో ప్యాసింజర్స్​ దిగేందుకు బైపాస్​పైనే ఆర్టీసీ బస్సులు నిలుపుతున్నారు.

దీంతో ప్రయాణికులు రోడ్డు దాటే క్రమంలో ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. హైవే ఆఫీసర్లు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఆర్టీసీ సిబ్బంది రూల్స్​ పాటించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బైపాస్​పై బస్సులు ఆపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.