మేడారం జాతరకు యాదగిరిగుట్ట బస్సులు

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు  మేడారం జాతర కోసం యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోకు చెందిన60 బస్సులు, 160 మంది ఉద్యోగులు స్పెషల్ డ్యూటీపై వెళ్లారని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలో ఈ నెల 18 నుంచి 25 వరకు  30 బస్సులు మాత్రమే నడుస్తాయని పేర్కొన్నారు.  వారం రోజుల పాటు బస్సులు, సిబ్బంది కొరత కారణంగా కలిగే అసౌకర్యాన్ని భక్తులు అర్థం చేసుకోవాలని కోరారు