ఆగిన బస్సులు.. ప్రయాణికుల అవస్థలు

హిట్ అండ్ రన్ నిబంధనలకు వ్యతిరేకంగా డ్రైవర్లు చేపట్టిన ఆందోళనలు ఆర్టీసీని తాకాయి. కొత్త నిబంధనలు రద్దు చేయాలని ఆర్టీసీ ఆదిలాబాద్ ప్రైవేట్ బస్సుల డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టి దాదాపు 70 బస్సులను బంద్ చేశారు. దీంతో వివిధ గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. పండగ పూట ప్రైవేట్ బస్సులు నడవకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.     – వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్