రోటరీ క్లబ్ సేవలను విస్తరిస్తాం : బుశిరెడ్డి శంకర్ రెడ్డి

రోటరీ క్లబ్ సేవలను విస్తరిస్తాం : బుశిరెడ్డి శంకర్ రెడ్డి

ఆర్మూర్ వెలుగు: రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అందించే సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని రోటరీ క్లబ్​ డిస్ట్రిక్ గవర్నర్ బుశిరెడ్డి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆర్మూర్ జరిగిన రోటరీ క్లబ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు. జర్నలిస్ట్ కాలనీలో రోటరీ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి, మహిళలందరూ ఈ శిక్షణ కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఆర్మూర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి కుర్చీలు, టేబుల్స్ డొనేట్ చేశారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాస్, రోటరీ ప్రెసిడెంట్ పట్వారి గోపి కృష్ణ, కార్యదర్శి పట్వారీ తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, సభ్యులు పుష్పక్​రావు, విజయసారథి ,రాజ్ కుమార్ అగర్వాల్, లింగా గౌడ్, గంగమోహన్, రజనీశ్​తదితరులు పాల్గొన్నారు.