స్పీకర్ ఛాంబర్లో బీఏసీ భేటీ.. హాజరైన సీఎం రేవంత్, హరీశ్

స్పీకర్ ఛాంబర్లో బీఏసీ భేటీ.. హాజరైన సీఎం రేవంత్, హరీశ్

అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో   బీఏసీ సమావేశం కొనసాగుతోంది. సీఎం  రేవంత్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం..   ప్రభుత్వ విప్ లు, బీఏసీ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు  హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి , MIM  ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ,  సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు ఈ బీఏసీ సమావేశానికి హాజరయ్యారు.  అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై చర్చిస్తున్నారు.  డిసెంబర్ 21 వరకు సమావేశాలు  జరిగే అవకాశం కనిపిస్తోంది. 

మరో వైపు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ హాలులో  తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్వోఆర్–-2024 డ్రాఫ్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రైతు భరోసా, గ్రామాల్లో వీఆర్వోల నియామకం, ఏడాది ప్రజాపాలన, కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించనుంది.