వ్యాపారంలో అడుగుపెట్టాలని, అత్యున్నత శిఖరాలకు ఎదగాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. కానీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిన డబ్బు లేకపోవడంతో చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. మీకు మిలియన్- డాలర్ వ్యాపార ఆలోచన ఉండవచ్చు. కానీ అది అమలు చేయకపోతే వృథానే కదా. కేవలం రూ. 10వేల కంటే తక్కువ పెట్టుబడితో స్టార్టప్‌ని ప్రారంభించాలని చూసే వారికి మార్కెట్ లో అనేక అవకాశాలున్నాయి. మీరు విద్యార్థి, గృహిణి, మహిళా ఇలా మరేదైనా ఇతర పని చేస్తున్నా సరే.. మీరు దేశంలో ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా కేవలం రూ. 10వేల లోపు పెట్టుబడితో వ్యాపార ఆలోచనలను ప్రారంభించవచ్చు.
ఊరగాయ వ్యాపారం : రూ.10వేల లోపు ఉత్తమ వ్యాపార ఆలోచనలలో ఇది ఒకటి. చాలామంది తమ భోజనంలో కూరగాయలతో పాటుగా చట్నీలకు ఎక్కువగా ప్రాధన్యత ఇస్తారు. ఇంట్లో పచ్చళ్లను తయారు చేయడం అంత తేలికైన పని కాదు కాబట్టి.. మీరు ఈ ఊరగాయ వ్యాపారాన్ని రూ. 10వేలతో ప్రారంభించవచ్చు. దీనికి కావలసిందల్లా తాజా ముడిసరుకు, అమ్మమ్మల పర్ఫెక్ట్ రెసిపీ, కొంత ప్యాకేజింగ్ మెటీరియల్ తో మంచి మార్కెటింగ్, నోటి మాట మొదలైన వాటి ద్వారా మరింత మంది కస్టమర్‌లను చేరుకోవచ్చు.
బ్లాగింగ్ : తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకునే వారికి ఇదొక ప్లాట్‌ఫారమ్. ఇప్పుడు చాలా కంపెనీలు కూడా తమ వెబ్ సైట్ ప్లాట్‌ఫారమ్ కోసం ఆసక్తికరమైన కథనాలను క్యూరేట్ చేయగల బ్లాగర్‌ల కోసం వెతుకుతున్నాయి. ఈ ఇంటర్నెట్ యుగంలో, బ్లాగింగ్ విజయవంతమైన వ్యాపారాలకు వెన్నెముకగా మారింది. దీని గొప్పదనం ఏమిటంటే దీనికి పెద్దగా డబ్బు అవసరం లేదు. రూ. 10వేల కంటే తక్కువ పెట్టుబడితోనే బ్లాగింగ్ ప్రారంభించవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే డబ్బులు బాగా సంపాదించవచ్చుు.
యూట్యూబ్ లో వంట ట్యుటోరియల్స్ : చాలా మందికి తక్కువ సమయంలో రుచికరమైన ఆహారాన్ని తయారు చేసే టాలెంట్ ఉంటుంది. ఒకవేళ మీకూ ఆ టాలెంట్ ఉంటే మీ రుచికరమైన వంటకాన్ని ప్రపంచంతో పంచుకోవచ్చు. దీని ద్వారా ఫేమ్ తో పాటు మనీ కూడా సంపాదించుకోవచ్చు. మీకు ఓ మోస్తరు స్థాయిలో సబ్ స్ర్కైబర్స్ వచ్చాక.. మీ యూట్యూబ్ కమ్యూనిటీతో భాగస్వామ్యం చేయవచ్చు. యూట్యూబ్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో చేసే లాభదాయకమైన వ్యాపారం.
యోగా తరగతులు : ఈ బిజీ లైఫ్ షెడ్యూల్ లో జనాలు తమ ఆరోగ్యంపైన శ్రద్ధ చూపించడం లేదు. కరోనా తరువాత యోగా లాంటివి చాలా అవసరమని అర్థం చేసుకుంటున్నారు. అయితే ఈ యోగాసానలపైన కాస్త అవగాహాన ఉంటే... మీరు ఇంట్లో లేదా కమ్యూనిటీ సెంటర్‌లో యోగా ఆసనాలను బోధించడం ప్రారంభించవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. ప్రస్తుతం దీనికి చాలా డిమాండ్ కూడా ఉంది.