సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సేవల సంస్థ అసెం డియన్ హైదరాబాద్‌లో ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టూడియోను ప్రారం భించింది. ఈ యూఎస్ కంపెనీకి భారతదేశంలో ఇది రెండో ఏఐ స్టూడియో. ఇక్కడ 350 మంది పనిచేస్తారని కంపెనీ ప్రకటిం చింది. వచ్చే ఏడాది నాటికి వీరి సంఖ్యను వెయ్యికి పెంచుతామని తెలిపింది.
నీరు..కొత్త కరెన్సీ ’ అనే థీమ్‌తో మూడు రోజుల పాటు జరిగే 30వ ఇండియన్ ప్లంబింగ్ కాన్ఫరెన్స్ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గురువారం ప్రారంభమైంది. పైప్‌లు వేయడం, వాటిని అమర్చడానికి మాత్రమే కాకుండా ప్రజారోగ్యం, పర్యావరణ సుస్థిరత కోసం ప్లంబింగ్ నిపుణులు పనిచేస్తున్నారని రాష్ట్ర ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు తన వీడియో సందేశంలో తెలిపారు.
ఫ్యాషన్ రిటైలర్ ఐశ్వర్య సిల్క్స్ హైదరాబా ద్లో మరో స్టోర్‌ను ఏర్పాటు చేసింది. శంకర్ పల్లిలో నిర్మించిన స్టోర్‌ను యాంకర్ సుమ ప్రారంభించారు. సంస్థకు ఇది వరకే హైదరాబాద్‌లోని కూకట్ పల్లి, చందానగర్‌లో స్టోర్స్ ఉన్నాయి. కంచిపట్టు, ముల్ కాటన్, మంగళగిరి పట్టు, కాటన్, కాంజీవరం సిల్క్, బనారస్, పటోలా సహా ఎన్నో రకాల చీరలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
మిడ్-సైజ్ కాంటాక్ట్ సెంటర్ వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ ఎంఎస్ఎంఈ బిజినెస్ ఫోరంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే 3 సంవత్సరాలలో 10 వేల కంటే ఎక్కువ ఎంఎస్ఎంలకు తన ప్రపంచ స్థాయి బీపీఓ పరిష్కారాలను అందించబోతోంది. వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ ఎంఎస్ఎంఈ బిజినెస్ ఫోరమ్ కొరకు స్పెషల్ పర్పస్ వెహికల్(ప్రత్యేక సంస్థ) ఉంటుంది. ప్రత్యేక నైపుణ్యం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చుతుంది.
వెహికల్ కాంపోనెంట్లను తయారు చేసే బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ ఐపీఓకి వచ్చేందుకు సెబీ వద్ద ప్రిలిమినరీ పేపర్లను సబ్మిట్ చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.2,150 కోట్లను సేకరించాలని చూస్తోంది. బెల్‌రైజ్‌కు 2023–24 లో రూ.7,484.24 కోట్ల రెవెన్యూపై రూ.310.88 కోట్ల నెట్ ప్రాఫిట్ వచ్చింది.