మలయాళ ప్రముఖ స్టార్ హీరోయిన్ హనీరోజ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకుగాను వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌పై ఇటీవలే హనీరోజ్ పోలీసులకి కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు బుధవారం బాబీ చెమ్మనూర్ ని వాయనాడ్‌లోని మెప్పాడిలోని అతని ఎస్టేట్‌లో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు బాబీపై లైంగిక వ్యాఖ్యలు చేసినందుకు BNS సెక్షన్ 75(1)(4) కింద కేసు నమోదు చేశారు.
ఈ విషయం ఇలా ఉండగా నటి హానీ రోజ్ గతంలో బాబీ కి సంబందించిన జ్యువెలరీ దుకాణ ప్రారంభిత్సవంలో పాల్గొంది. దీంతో వీరిద్దరిమధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బాబీ ప్రవర్తనలో మార్పులు రావటం గమనించిన హానీ రోజ్ కొంతకాలంగా అతడికి దూరంగా ఉంటోంది. అలాగే ఇకపై బాబీ కి సంబందించిన దుకాణాల ప్రారంభిత్సవంలో కూడా పాల్గొనకూడదని నిర్ణయించుకుంది.
ALSO READ | Sreeleela: స్టార్ హీరో కొడుకు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్... శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్..
దీంతో బాబీ హానీ రోజ్ ని ఉద్దేశించి సోషల్ మీడియా, ఇంటర్వ్యూ వీడియోస్ లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ హానీ రోజ్ ని ఇబ్బంది పెడుతున్నాడు. కానీ హనీరోజ్ మాత్రం మరోమారు సోషల్ మీడియా లేదా ఇతర ఇంటర్వూలలో తన పేరుని ఉపయగించి మాట్లాడవద్దని తన మేనేజర్ ద్వారా చెప్పినప్పటికీ బాబీ మాత్రం వినడం లేదు. దీంతో మంగళవారం హనీరోజ్ ఎర్నాకులం పోలీసులకి ఫిర్యాదు చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా నటి హనీరోజ్ తెలుగులో స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు ఆడియన్స్ ని బాగానే మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో నటించలేదు.