![Monalisa: మొనాలిసాకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన బిజినెస్ మెన్.. ఎవరంటే..?](https://static.v6velugu.com/uploads/2025/02/businessman-boby-chemmanur-gifted-the-diamond-necklace-to-the-khumbmel-monalisa_YGAMS28dXt.jpg)
మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు చెయ్యడానికి వెళ్లి పూసలు అమ్ముకోవడానికి వచ్చిన మోనాలిసా ని ఒక్కసారిగా ఫేమస్ చేసేశారు. దీంతో కుంభమేళాకి వెళ్లినవారి పాపాలు పోయాయో లేదో తెలియదు కానీ మోనాలిసా లైఫ్ మాత్రం దెబ్బకి సెట్ అయిపొయింది. ఎంతలా అంటే పూరి గుడిసె నుంచి ఏకంగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఆఫర్లు అందుకునే స్థాయికి వెళ్ళిపోయింది. దీంతో ప్రస్తుతం మోనాలిసా సెలెబ్రెటీ అయిపోయింది.
అయితే మోనాలిసాకి కేరళకి చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ బాబీ చెమ్మనూర్ ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ డైమండ్ నెక్లెస్ విలువ దాదాపుగా రూ.15 లక్షలు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే బాబీ చెమ్మనూర్ మోనాలిసాకి స్వయంగా ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబీ చెమ్మనూర్ కి కేరళలో గోల్డ్ షాప్స్ ఉన్నాయి. దీంతో త్వరలోనే మోనాలిసా ని తన షాప్స్ ని ప్రమోట్ చేసుకునేందుకు బ్రాండ్ అంబాజిడర్ గా నియమించనున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయం ఇలా ఉండగా బాబీ చెమ్మనూర్ ఇటీవలే ప్రముఖ హీరోయిన్ హానీ రోజ్ ని వేధించిన కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. అయితే బాబీ చెమ్మనూర్ తనపై పలుమార్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని అలాగే అనవసరంగా అసత్య ప్రచారాలు చేశాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది.
దీంతో కొచ్చిన్ పోలీసులు బాబీ చెమ్మనూర్ తన ఫామ్ హౌజ్ లో ఉండగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. దీంతో బాబీ బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ 14 రోజులు రిమాండ్ ముగిసేంతవరకూ బెయిల్ మంజూరు చెయ్యమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో మరోసారి తన వ్యాపారాలు, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని కోరగా కోర్టు కనికరించి షరతులతో కూడిన బెయిల్ ఇటీవలే మంజూరు చేసింది.
స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన అమ్మాయి మోనాలిసా భోస్లే(16)కు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాను తీసుకోనున్నారు. ఆమె రూపం, అమాయకత్వానికి తాను ఫిదా అయ్యానని సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమెకు తన మూవీలో చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలిపాడు.