రైతులను మోసగించిన వ్యాపారి .. రూ.3కోట్లు టోకరా

ములుగు,  వెలుగు:  ములుగు మండలం కాశిందేవిపేటలో 138 మంది రైతుల నుంచి వడ్లు కొని డబ్బులు ఇవ్వకుండా రూ.3కోట్లు టోకరా వేసి తప్పించుకు తిరుగుతున్న వ్యాపారి ఇబ్రహీం అలియాస్​ జానీమియాను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ గాష్​ ఆలం  శుక్రవారం తెలిపారు.  రైతుల ఫిర్యాదుతో  ములుగు పోలీస్​ స్టేషన్​ లో నిరుడు  కేసు నమోదైంది.  

రైతులను నిలువునా ముంచి వివిధ జిల్లాల్లో పేరు మార్చుకొని మొబైల్​ నంబర్​ మార్చి  తిరుగుతున్నాడు.  పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టి అరెస్ట్​ చేశారు.  ఇబ్రహీంను పట్టుకోవడంలో సీసీఎస్​ సీఐ రవీందర్​, ఏఎస్సై సుధీర్​, సైబర్​ క్రైమ్​ కానిస్టేబుల్ జాహూర్​, ఐటీకోర్​ కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్, కానిస్టేబుల్​ రఘు  కృషి చేశారు. వీరికి ఎస్పీ గాష్​ ఆలం రివార్డు అందించారు.  త్వరలోనే మనీ రికవరీ చేసి రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించినట్లు రైతులు తెలిపారు.