
లోన్ల పేరుతో రైతులను, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిన వ్యాపారిని మార్చి 21న హైదరాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గుంటూరులోని పద్మజ కాలనీకి చెందిన గురు శ్రీరంగ శ్రీనివాస్ బోదనబోయినగా గుర్తించారు.
శ్రీరంగ శ్రీనివాస్ ప్రకాశం జిల్లాకు చెందిన వాడు.మొదటగా హైదరాబాద్ బేగంపేటలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేశాడు. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. నకిలీ బెండకాయ విత్తనాలను రిజిస్టర్ కాని బ్రాండ్ కింద రైతులకు సరఫరా చేశాడు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో చాలా మంది రైతులు నష్టపోయారు. దీంతో వాళ్లకు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కనిపించకుండా పోయాడు.
ALSO READ | Layoffs: ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు.. 2వేల మంది ఉద్యోగులు అవుట్
అలాగే 2022లో 3 లక్షల లోన్ కోసం తనఖా కింద డాక్యుమెంట్స్ కు బదులుగా సేల్ డీడ్ పై సంతకం చేయించుకుని ఆస్తి రాయించుకున్నారు. ఈ ఆస్తి తనాఖా పెట్టి మరిన్ని లోన్లు తీసుకున్నాడు. 2023లో స్టార్టప్ సాఫ్ట్ వేర్ కంపెనీలో భాగస్వామ్యం ఇప్పిస్తానని మరో వ్యక్తి నుంచి రూ. 17050 లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఇలా రకరకాలుగా బాధితుల నుంచి కోట్లు కాజేసి పరారయ్యాడు శ్రీరంగ శ్రీనివాస్.
బాధితుల ఫిర్యాదు మేరకు పక్కా సమాచారంతో పోలీసులు లంగర్ హౌజ్ లో అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.