మలయాళ స్టార్ హీరోయిన్ హానీ రోజ్ కొన్ని రోజులుగా తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే సోషల్ మీడియాలో తనపై కామెంట్లు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్నూర్ పై హానీ రోజ్ పోలీసులకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖ బాబీ చెమ్నూర్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
అయితే మరో ప్రముఖ వ్యాపారవేత్త అయిన రాహుల్ ఈశ్వర్ పై కూడా హానీ రోజ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఇందులో వ్యాపార నిమిత్తమై రాహుల్ ఈశ్వర్ తో కలసి పని వచేసేందుకు నో చెప్పడంతో తనని కించపరిచే విధంగా మాట్లాడటం, సోషల్ మీడియాలో కామెంట్లు చెయ్యడం వంటి వి చేశాడని ఆరోపిస్తూ పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాహుల్ ఈశ్వర్ పై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
ALSO READ | Prabhas marriage: ప్రభాస్ కి కాబోయే భార్య తెలుగమ్మాయేనా.? మరి ఆ హీరోయిన్..?
ఈ విషయంపై రాహుల్ ఈశ్వర్ స్పందించాడు. ఇందులోభాగంగా తాను హనీరోజ్ ను ఒక్కమాట తిట్టినట్లు చూపిస్తే విచారణ లేకుండానే జైలుకు వెళ్తానని అన్నాడు. అలాగే హనీ రోజ్ గురించి నేను చెడుగా మాట్లాడితే, విచారణ లేకుండా నన్ను జైలులో పెట్టాలి. కానీ నేనెప్పుడూ ఆమె గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడాలేదు. నేను న్యాయవాదిని. నా కేసు నేనే వాదిస్తాను. రామన్ పిళ్లై లేదా ముకుల్ రోతగిని వంటి ప్రముఖ అడ్వాకెట్లని నియమించుకోవడానికి నా దగ్గర డబ్బు లేదని తెలిపాడు. అలాగే తాను లాయర్ ని కాబట్టి ఇతర అడ్వకెట్స్ అవసరం లేకుండా తన కేసుని తానే వాదించుకుంటానని తెలిపాడు. కానీ అంతకంటే ముందుగా హనీ రోజ్ సోషల్ ఆడిట్ చేయించుకోవాలని రాహుల్ ఈశ్వర్ సూచించాడు.