Hyderabad Dishesh:ప్రపంచం మెచ్చిన ఫుడ్లో..హైదరాబాద్ బిర్యానీ..తినరా మైమరిచి..లొట్టలేసుకుంటూ

Hyderabad Dishesh:ప్రపంచం మెచ్చిన ఫుడ్లో..హైదరాబాద్ బిర్యానీ..తినరా మైమరిచి..లొట్టలేసుకుంటూ

ఫుడ్ విషయంలో మన భారతీయులను మించినోళ్లు లేరబ్బా..రుచికరమైన వంటలు వండాలన్నా మనమే..తినాలన్నా మనమే..భారతీయ వంటకాలకు దశాబ్దాల చరిత్ర ఉంది..మన వంటకాలను రుచిచూడని దేశాలు లేవంటే ఆశ్చర్యమేమి లేదు.. ఇండియన్ డిషెస్ కి అంత క్రేజ్ ఉంది.. ఇదే విషయాన్ని TasteAtlas ర్యాంకింగ్స్ చెబుతున్నాయి..2024లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భోజనప్రియులు ఎంతో ఇష్టంగా తిన్న 100 ఉత్తమ వంటకాలకు టేస్ట్అట్లాస్ వరల్డ్ ఫుడ్ అవార్డులను ప్రకటిం చింది. ఇందులో భారతీయ వంట కాలు మొదటి వరసలో ఉన్నాయి. 

భారతదేశంలోని ప్రసిద్ధ వంటకాలు..ప్రత్యేకించి మన హైదరాబాద్ వంటకాలు టాప్ లో ఉన్నాయి. బటర్ చికెన్, హైదరాబాదీ బిర్యానీ, చికెన్ 65,కీమా 100 ఉత్తమ వంటకాలలో స్థానం పొందాయి.

ప్రపంచం ఇష్టపడిన హైదరాబాదీ డిషెస్.. 

హైదరాబాదీలు ఎంతగానో ఇష్టపడే బటర్ చికెన్ అకా ముర్గ్ మఖానీ వంటకం 29స్థానంలో ఉండగా.. హైదరబాదీ బిర్యానీ 31వ స్థానంలో ఉంది. ఇక దక్షిణాదికి చెందిన డీప్ ఫ్రైడ్ అపెటైజర్ చికెన్ 65 వంటకం 97 స్థానంలో ఉంది. భారతీయులకు ఎంతో ఇష్టమైన వంటకం 100 వస్థానాన్ని దక్కించికుంది. 

ALSO READ | Good Health : పిల్లల్లో రోజురోజుకు తగ్గుతున్న ప్రొటీన్లు.. ఇవి తింటే బలంగా తయారవుతారు..!

బటర్ చికెన్ ,హైదరాబాదీ బిర్యానీ రెండూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భోజన ప్రియుల నుంచి 5స్టార్లలో 4.52 రేటింగ్ సంపాదించాయి. చికెన్ 65 ,కీమా ఒక్కొక్కటి 4.44 రేటింగ్ పొందాయి. ఫుడ్ గైడ్ అమృతసరి కుల్చా ,బటర్ గార్లిక్ నాన్ వంటి భారతీయ వంటకాలను కూడా అవార్డులలో ప్రస్తావించారు.

ప్రపంచ నంబర్ వన్ వంటకాలు... 

ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడి తిన్న వంటకం కొలంబియాకు చెందిన లెచోనా.. పంది పొట్టలో పచ్చ బఠానీలు, పచ్చి ఉల్లిపాయలు, మసాలా దినుసులతో నింపి కాల్చి వండిన వంటకం..ఒది అవుట్ డోర్ ఓవర్ వంటకం. 

టాప్ 10లో మిగతా తొమ్మిది స్థానాల్లో ..

నేపాల్ కు చెరందిన నియాపోలిటన్ పిజ్జా, పికాన్హా(బ్రెజిల్‌), రెచ్టా(అల్జీరియా), ఫనాంగ్ కర్రీ(థాయిలాండ్‌), అసడోకబాబ్(అర్జెంటీనా)కోకర్ట్‌మే(టర్కీ), రావోన్ (ఇండోనే షియా) , కాగ్ కబాబ్ (టర్కీ),టిబ్స్ (ఇథియోపియా) వరుసగా రెండవ నుంచి10 వరకు స్థానాల్లో ఉన్నాయి.