
భారత దేశం రుచికరమైన వంటకాలకు పెట్టింది పేరు. ప్రపంచంలో భారతీయ వంటకాలను ఇష్టపడని వారుండరు. లొట్టలేసుకుంటూ తింటారు. వంటకం ఏదైనా సరే.. ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. భారతీయ వంటకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు..సంస్కృతి, ఆచారాలు, పండుగలతో కూడిన ఒక అనుభవం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ వంటకాలను వండుకొని ఇష్టంగా తింటారు. అలాంటి మన వంటకాలు బెస్ట్ వంటకాలుగా గుర్తించబడ్డాయి..గుర్తించబడుతూనే ఉన్నాయి. ప్రపంచస్థాయిలో టేస్ట్ అట్లాస్ నిర్వహించే ర్యాంకింగ్స్లో ఈసారి భారతీయ రొట్టెలు ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాయి. బటర్ గార్లిక్ నాన్ ను ప్రపంచంలో బెస్ట్ బ్రెడ్ గా టేస్ట్ అట్లాస్ ప్రకటించింది. దీంతో పాటు మరికొన్ని భారతీయ రొట్టెలు కూడా స్థానం దక్కించుకున్నాయి.
టేస్ట్ అట్లాస్ ప్రకటించిన 50 బెస్ట్ బ్రెడ్స్ లిస్టు(50 ఉత్తమ రొట్టెలు)లో చాలా రకాల ఇండియన్ రోటీస్ చోటు దక్కించుకున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన మొత్తం 50 రోటీలలో 4.7 రేటింగ్తో బటర్ గార్లిక్ నాన్ ఈ జాబితాలో మొదటి ప్లేస్ లో ఉంది. ఇక అందరికీ ఇష్టమైన అమృత్సరి కుల్చా నార్త్ ఇండియన్ రోటీ సెకండ్ ప్లేస్ లో ఉంది. దక్షిణ భారత రోటీ పరోటా ఆరో స్థానంలో నిలిచింది. ఇంకా ఎనిమిదవ స్థానంలో నాన్, 18వ స్థానంలో పరాఠా దక్కించుకున్నాయి.
ALSO READ | Good Health: రోజూ బీన్స్ తినండి..షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోండి..!
బటర్ గార్లిక్ నాన్ ఓ సాంప్రదాయ రోటీ, ఎక్కువమంది ఇష్టపడే ఇండియన్ నాన్ రకాల్లో ఒకటి. పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, చక్కెర, దహితో దీనిని తయారు చేస్తారు. వేడి తాండూర్ ఓవెన్ లో బంగారు వర్ణంలోకి వచ్చేదాక కాల్చి దానికి వెన్న లేదా నెయ్యి రుద్దుతారు. మెత్తగా తరిగిన వెల్లుల్లి, కొత్తమీరతో వడ్డిస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది.