ఎండ నుంచి ఉపశమనం.. బాటసారులకు మజ్జిగ పంపిణి..

ఎండ నుంచి ఉపశమనం.. బాటసారులకు మజ్జిగ పంపిణి..

 ఎండలు మండుతున్నాయి.  జనాలు అనేక పనులపై బయటకు వెళుతుంటారు.  బాటసారుల దాహం.. దప్పిక తీర్చేందుకు మల్కాజిగిరిలో మాజీ విద్యుత్​ ఉద్యోగి గుండు వెంకటరావు జ్ఞాపకార్ధం మజ్జిగను పంపిణి చేశారు.  వేసవి తీవ్రత దృష్ట్యా  రహదారి వెంట ప్రయాణించే ప్రజల దాహార్తిని తీర్చేందుకు  మజ్జిగ పంపిణీ చేశామన్నారు ఆయన కుటుంబసభ్యులు. 

ఈ సందర్భంగా గుండు చిన్మయకుమార్​ మాట్లాడుతూ.. ఎండాకాలంలో జనాల దాహాన్ని తీర్చేందుకు తమ తండ్రి జ్ఞాపకార్ధం మజ్జిగను పంపిణీ చేశామని తెలిపారు.  మంచినీరు కంటే మజ్జిగను అందిచడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు .. ఇతర లవణాలు అందుతాయని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో సాయి కుమార్, సూర్యనారాయణ తదితరులున్నారు.