హైదరాబాద్, వెలుగు : పెట్టుబడుల సంస్థ గ్రిప్ ఇన్వెస్ట్ బాండ్లు, సెక్యూరిటైజ్డ్ డెట్ఇన్స్ట్రమెంట్(ఎస్ డీ ఐ) నుంచి అధిక రిటర్నులు పొందడానికి ఒక కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. స్థిర ఆదాయ పెట్టుబడిదారులకు ఇన్వెస్ట్ మెంట్ ను సులభతరం చేయడానికి
‘గ్రిప్ బై ఇన్వెస్ట్’ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో బాండ్లు, ఎస్ ఐ లను థీమ్ ఆధారిత బాస్కెట్లుగా వినియోగించుకోవచ్చు. వన్ క్లిక్ పేమెంట్ ఆప్షన్ ద్వారా గ్రిప్ ఇన్వెస్ట్ లోని రిటైల్ ఇన్వెస్టర్లకు అధిక రిటర్నులు వచ్చేలా దీన్ని రూపొందించారు.