OLX లో స్కూటీ సెల్లింగ్ యాడ్ చూశాడు.. స్కూటీ కొంటాను అని వచ్చాడు... కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తానంటూ స్కూటీని టెస్ట్ డ్రైవింగ్ కు అడిగాడు.. సరేలే అని స్కూటీ యజమాని.. టెస్ట్ డ్రైవింగ్ కోసం వెళ్లి చాలా సేపు అయింది.. స్కూటీతోపాటు వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు.. ఇంకేముందు స్కూటీ దొంగిలించబడిందని ఆ యజమాని గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేశాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
దక్షిణ ముంబై ప్రాంతంలోని శామ్యూల్ వీధికి చెందిన సయ్యద్ అలీ కుటుంబ అవసరాలకోసం సుజ్ కీ స్కూటీని ఇటీవల కొనుగోలు చేశాడు.. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి, ఇంకా చిన్న చిన్న పనులు చేసుకునేందుకు తన సోదరి కోసం ఈ స్కూటీని కొనుగోలు చేశాడు... అయితే ఆమె ఎప్పుడూ కూడా స్కూటీని ఉపయోగించలేదు.. డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా ఆమె ఆసక్తి చూపలేదు.. దీంతో అలీ స్కూటీని అమ్ముతానంటూ OLX లో సెల్లింగ్ యాడ్ ఇచ్చాడు.
Also Read:వీళ్ళ ఆనందం మాములుగా లేదే
OLX లో సెల్లింగ్ యాడ్ చూసిన ఓ వ్యక్తి స్కూటీని కొనుగోలు చేసేందుకు వచ్చాడు.. అలీ అతడిని డోంగ్రీ చార్నర్ దగ్గర కలిశాడు. కొనుగోలు దారు స్కూటీ బాగుంటు కొనుగోలు చేస్తానని నమ్మబలికాడు. అయితే ముందుగా టెస్ట్ డ్రైవ్ చేస్తానని కోరాడు. అలీ దీనికి ఒప్పుకొని కీ ఇచ్చాడు. కానీ టెస్ట్ డ్రైవ్ కు బదులుగా.. ఆ వ్యక్తి స్కూటీతో పారిపోయాడు. దొంగతనం జరిగిందని గుర్తించిన అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరుగుతోంది.