
నిర్మల్, వెలుగు: నిర్మల్‌కు చెందిన ప్రముఖ కవి, తెలంగాణ రచయితల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి, సంస్కృత భాషా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బి.వెంకట్‌కు ఉత్తమ కవి అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన 134వ అంతర్జాతీయ శతాధిక పద్య కవుల సమ్మేళనంలో భాగంగా సీస పద్య వైభవం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకట్‌ను ఉత్తమ కవి అవార్డుతో సన్మానించారు.
ఈ సభలో సంస్థ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, కొల్లి రమావతి, చిట్టెం లలిత, శ్రీహరి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ కవికి అవార్డు దక్కడంతో పలువురు ఆయనను అభినందించారు.