ఫీజు బకాయిలు విడుదల చేయాలి : ఏబీవీపీ నాయకులు

ఫీజు బకాయిలు విడుదల చేయాలి : ఏబీవీపీ నాయకులు
  • కలెక్టరేట్​ముట్టడికి యత్నించిన ఏబీవీపీ నాయకులు

హనుమకొండ కలెక్టరేట్‌, వెలుగు: ఫీజు రీయంబర్స్​మెంట్, స్కాలర్​షిప్ బకాయిలు విడుదల చేయాలంటూ ఏబీవీపీ నాయకులు బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం కలెక్టరేట్ మెయిన్​ గేట్​ఎదుట ఆందోళనకు దిగగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినా, కొంతమంది లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా ఏసీపీ దేవేందర్​ రెడ్డి అక్కడికి చేరుకొని, సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.  వినకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్​ చేసి, ఠాణాకు తరలించారు.

 ఈ సందర్భంగా ఏబీవీపీ  ప్రాంత కార్య సమితి సభ్యుడు ఆరెపల్లి సుజిత్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, యూనివర్సిటీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.  మహానగర్ కార్యదర్శి తాళ్లపల్లి అరుణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రవణ్, భరత్, శ్రీజ, హరిచరణ్, శ్రీకాంత్,  రోహిత్, సర్దార్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.