
న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో వరుసగా టైటిళ్లు కొల్లగొడుతున్న ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి ర్యాంక్‌లోనూ దూసుకెళ్తున్నారు. కొరియా ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ ఇద్దరూ బీడబ్ల్యూఎఫ్ మంగళవారం రిలీజ్ చేసిన తాజా లిస్ట్‌లో మూడు నుంచి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ అందుకున్నారు. ప్రస్తుతం 87,211 పాయింట్లతో ఉన్నారు. విమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు 17వ ర్యాంక్‌లో ఉండగా, సైనా నెహ్వాల్ 37వ ర్యాంక్‌కు పడిపోయింది. మెన్స్‌లో ప్రణయ్ ఇండియా నుంచి అత్యధికంగా పదో ర్యాంక్‌లో ఉన్నాడు. లక్ష్యసేన్ ఒక ప్లేస్ పడిపోయి 13వ ర్యాంక్‌లో నిలిచాడు. ఫామ్ కోల్పోయిన శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో మార్పు లేదు.
ALSO READ :వరల్డ్ ట్రయల్స్ గెలిస్తే ఆసియాడ్‌కు