హాంగ్జౌ : ఇండియా డబుల్స్ షట్లర్లు పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టారు. శుక్రవారం జరిగిన గ్రూప్–ఎ చివరి మూడో మ్యాచ్‌లో గాయత్రి–ట్రీసా జోడీ 17–21, 13–21తో నాలుగో ర్యాంకర్ నమి మత్సుయామ–చిహరు షిదా (జపాన్) జంట చేతిలో వరుస గేమ్స్‌లో పరాజయం పాలయింది. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేతలైన జపాన్ షట్లర్లతో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇండియా జోడీకి ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం.