20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌24 చివరి కల్లా చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ దివాలా తీస్తది

20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌24 చివరి కల్లా చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ దివాలా తీస్తది
  • 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌24 చివరి కల్లా ఇది జరుగుతుంది
  • యూజర్లు వాడడం తగ్గిపోతోంది
  • కొత్త  ఏఐ చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌లు వస్తున్నాయి..ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ లాస్ పేరుకుపోతోంది
  • అనలిటిక్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా మ్యాగజైన్ వెల్లడి 

న్యూఢిల్లీ: మొత్తం టెక్నాలజీ ఇండస్ట్రీలో చాట్‌‌‌‌‌‌‌‌ జీపీటీ ఒక సంచలనం. ఉద్యోగులను భర్తీ చేస్తుందనే భయాలు కూడా ఎక్కువయ్యాయి. కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ను ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ తీసుకొచ్చింది. ఈ కంపెనీ 2024 చివరి కల్లా దివాలా తీస్తుందని అనలిటిక్స్ ఇండియా మ్యాగ్‌‌‌‌‌‌‌‌జైన్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. జీపీటీపై ట్రేడ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌ కోసం ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ అప్లయ్ చేసుకుందని, ఇదే కంపెనీ పతనానికి కారణమవుతుందని ఈ రిపోర్ట్ పేర్కొంది. చాలా మంది యూజర్లు చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీని వాడడం మానేస్తారని కూడా అంచనా వేసింది. చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ  వాడకం మేతో పోలిస్తే  జూన్‌‌‌‌‌‌‌‌, జులైలో  తగ్గడాన్ని అనలిటిక్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా మ్యాగ్‌‌‌‌‌‌‌‌జైన్‌‌‌‌‌‌‌‌  ప్రస్తావించింది. చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ వరుసగా రెండో నెలలో కూడా తగ్గిందని  సిమిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెబ్‌‌‌‌‌‌‌‌ ఈ నెల 3 న ప్రకటించింది.  జులైలో 9.6 శాతం తగ్గిందని, జూన్‌‌‌‌‌‌‌‌లో 9.7 శాతం తగ్గిందని వెల్లడంచింది. జూన్‌‌‌‌‌‌‌‌లో 170 కోట్ల మంది యూజర్లు చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ వాడగా, జులైలో ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 150 కోట్లకు పడిపోయిందని సిమిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెబ్‌‌ పేర్కొంది. 
రోజుకి 700,000 డాలర్లు ఖర్చు..
చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీని ఆపరేట్ చేయడానికి రోజుకి 700,000 డాలర్లను ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ ఖర్చు చేస్తోంది.  అనలిటిక్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా మ్యాగజైన్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఖర్చులను మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌, ఇతర ఇన్వెస్టర్లు భరిస్తున్నారు. ప్రాఫిట్స్ రాకపోతే  ఇన్వెస్టర్లు నష్టపోతారు. ‘ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ నష్టం ఈ ఏడాది మే నాటికి 540 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కొత్త ఏఐ చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ను డెవలప్‌‌‌‌‌‌‌‌  చేయడాన్ని ప్రారంభించాక కంపెనీ నష్టాలు పెరిగాయి. ఈ ఏడాది 200 మిలియన్ డాలర్ల రెవెన్యూ వస్తుందని కంపెనీ చెబుతోంది. 2024 నాటికి ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. 

ఇందులో క్లారిటీ లేదు. కంపెనీ నష్టాలు పేరుకుపోతున్నాయి’ అని రిపోర్ట్ వెల్లడించింది.  మార్కెట్‌‌‌‌‌‌‌‌లో గ్రాఫిక్స్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ) కొరత ఉందని,  దీంతో  కంపెనీ కెపాసిటీని మెరుగుపరచడం, కొత్త మోడల్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని  ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ ఫౌండర్ ఆల్టమన్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. 

కంపెనీ దివాలా తీస్తే ఇదొక కారణం అవుతుంది. జీపీటీ–5  కోసం ట్రేడ్‌‌‌‌‌‌‌‌మార్క్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 3 న ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ ఫైల్ చేసింది. దీనిని బట్టి కంపెనీ ట్రెయినింగ్ మోడల్స్‌‌‌‌‌‌‌‌ను ఉంచుకోవాలని చూస్తోందని విషయం తెలుస్తోందని ఎనలిటిక్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా మ్యాగజైన్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్  పేర్కొంది. ఇవన్నీ చూస్తుంటే  2024 చివరి నాటికి ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ దివాలా తీయొచ్చని, ఫండ్స్‌‌‌‌‌‌‌‌   సేకరించలేకపోతే ఇబ్బంది పడుతుందని వివరించింది.  

కొత్త ఏఐ చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌లు..

యాపిల్‌‌‌‌‌‌‌‌ తన ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్‌‌‌‌‌‌‌‌ చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చే పనిలో ఉందని జులై 19 న బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ చేసింది. ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ, ఇతర చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌లను ఇది ఛాలెంజ్ చేయొచ్చు. ఎలన్‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌‌‌‌‌ కూడా కొత్త ఏఐ కంపెనీ ఎక్స్‌‌‌‌‌‌‌‌ఏఐని లాంచ్ చేశారు. గూగుల్‌‌‌‌‌‌‌‌, ఓపెన్‌‌‌‌‌‌‌‌ఏఐ కంటే ఇది చాలా బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని చెబుతున్నారు. ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఏఐని మైక్రోసాఫ్ట్ కంట్రోల్ చేస్తోందని  మస్క్ విమర్శించారు.

కారణం ఇదేనా!

చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీ యూజర్లు తగ్గిపోవడడానికి కారణం ఏఐచాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వస్తుండడమని అనలిటిక్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా మ్యాగజైన్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. అంతేకాకుండా చాలా కంపెనీలు వర్క్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఈ యాప్‌‌‌‌‌‌‌‌ను వాడకుండా తమ ఉద్యోగులపై రిస్ట్రిక్షన్లు పెడుతు న్నాయని పేర్కొంది.  మరోవైపు మార్క్‌‌‌‌‌‌‌‌ జుకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌కు చెందిన మెటా  లామా2 చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చిందని,  లామా2 కి మైక్రోసాఫ్ట్‌‌‌‌‌‌‌‌  పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సెలెక్ట్ అయ్యిందని ఈ  రిపోర్ట్ పేర్కొంది. ఈ చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ విండోస్‌‌‌‌‌‌‌‌  ఆపరేటింగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది. ఓపెన్‌‌‌‌‌‌‌‌ సోర్స్‌‌‌‌‌‌‌‌గా లామా2  అందుబాటులో ఉందని, దీనర్ధం ఇతర కంపెనీలు కూడా ఈ చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ను రీసెర్చ్ చేయడానికి, సవరించడానికి వీలుంటుందని వెల్లడించింది. మరోవైపు గూగుల్‌‌‌‌‌‌‌‌ బార్డ్ కూడా చాట్‌‌‌‌‌‌‌‌జీపీటీకి పోటీగా వచ్చింది.