రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ పరిధిలోని తారామతిపేట్లో మంగళవారు (జూలై 16) తాళాలు పగలగొట్టి ఇంటి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బీరువాలు పగలగొట్టి 30తులాల బంగారం, కేజీ వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్ మెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులు ఇంటికి తిరిగి వచ్చే చూసేసరికి డోర్ పగలగొట్టి ఉండడం.. వేసిన తాళం పగలగొట్టి ఉండటంతో పోలీసులకు అబ్దుల్లాపూర్ మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.