Home Tip: ఇలా చేస్తే.. ఐరన్ బాక్సు ప్లేట్ పై మొండి మరకలు మాయం

Home Tip: ఇలా చేస్తే.. ఐరన్ బాక్సు ప్లేట్ పై మొండి మరకలు మాయం

ఇస్త్రీ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో వేడి ఎక్కువయ్యి దుస్తులు కాలిపోవడంతో పాటు, బరన్ బాక్సుకు మొండి మరకలు అంటుతాయ్. అ మరకలను తొలగించడా నికి చాలా మంది రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.. ఒకపట్టాన వదలవు కానీ ఈ చిట్కాతో ఐరన్ బాక్స్ అంటి ఉన్న మరకలు వదిలించొచ్చు. 

ఐరన్ బాక్స్ మీద మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు వెనిగర్ సాయంతో వాటిని తొలగించవచ్చు. వెట్ వెనిగర్ ను వేడి చేసి అందులో క్లాత్ ను ముంచి బరన్ బాక్స్ ప్లేట్ ను తుడవాలి. వెనిగర్ వల్ల కూడా ఫలితం కనిపించకపోతే టేబుల్ సాల్ట్ లేదా బేకింగ్ సోడా వేడిగా ఉన్న వైట్ వెనిగర్ వేసి అవి కరిగే వరకు బాగా కలపాలి. అందులో ఓ క్లాత్ ను ముంచి ఐరన్ బాక్సు ప్లేట్ పై తుడవాలి. మరకలు పోయే వరకు పడే వదే ఇలా చేయాలి. 

ALSO READ : Beauty Tip : జుట్టు ఎడాపెడా రాలిపోతుందా..? బలమైన జుట్టుకు ఈ చిట్కాలు పాటించండి..!

అన్నింటికంటే సింపుల్ గా హైడ్రోజన్ పెరాక్సైడ్ తో మరకలు పోగొట్టొచ్చు. క్లాత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లో ముంచి దానిని ఐరన్ బాక్సు ప్లేట్ పై రుద్దితే మరకలు పోతాయ్. ఐరన్ బాక్సు వేడి చేసి టూడ్- బ్రష్ పేస్టు రాసి కూడా మరకలు వదిలించవచ్చు. వేడి ఐరన్ బాక్స్ పై పేస్ట్ రాసి తర్వాత దాన్ని ఓ క్షాత్ పై రుద్దాలి. దీంతో మరకలు మాయం.