ముక్కుతో టైపింగ్​ చేసి.. గిన్నిస్​ వరల్డ్ రికార్డ్ సాధించాడు

ముక్కుతో టైపింగ్​ చేసి.. గిన్నిస్​ వరల్డ్ రికార్డ్ సాధించాడు

ఒక్కొక్కరిదీ ఒక్కో టాలెంట్. అందరూ చేతులతో కీబోర్డ్​ టైపింగ్ చేస్తారు. కానీ, ఇతను ముక్కుతో  టైపింగ్ చేస్తాడు. అది కూడా చాలా వేగంగా. ఆ టాలెంట్​కి గిన్నిస్​ వరల్డ్ రికార్డ్​ సొంతమైంది. ఒకసారి కాదు.. మూడుసార్లు తన రికార్డు తనే బ్రేక్ చేశాడు. అతని పేరు వినోద్​ కుమార్​ చౌధరి. వయసు 44 ఏండ్లు.

వినోద్​ కుమార్​ ‘ఫాస్టెస్ట్​ టైమ్​ టు టైప్ ది ఆల్ఫాబెట్​ విత్​ ది నోస్’ అనే టైటిల్​ కోసం ఈ ఫీట్​ చేశాడు. ముక్కుతో 27.80 సెకండ్లు టైపింగ్ చేసి రికార్డ్ సాధించాడు. గతంలో 25.66 సెకండ్లు ముక్కుతో టైపింగ్ చేశాడు. అంతటితో ఆగకుండా మరోసారి ట్రై చేసి 26. 73 సెకండ్లు టైపింగ్ చేశాడు. అది సరే కానీ ఇంతకీ ఏం టైప్​ చేశాడేంటి? అంటున్నారా... ఇదిగో ఇలా QWERTY కీబోర్డ్​లో రోమన్ ఆల్ఫాబెట్స్ A-– Z టైప్ చేశాడు.

ఒక్కో లెటర్​కి మధ్య స్పేస్​ కూడా ఇచ్చాడు. అందుకుగాను ‘టైపింగ్ మ్యాన్​ ఆఫ్​ ఇండియా’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్​లకు ఎక్కాడు. అంతేకాదు.. ఒక్క చేత్తో ఆల్ఫాబెట్స్​ని వెనక నుంచి ముందుకు 5.36 సెకండ్లలో టైప్ చేస్తాడు. అలాగే రివర్స్​లో కూర్చుని, చేతులతో ఆల్ఫాబెట్స్​ని 6.78 సెకండ్లలో టైప్ చేస్తాడు.

 ‘‘నా ప్రొఫెషన్ టైపింగ్. అందుకే టైపింగ్​లో రికార్డ్​ క్రియేట్ చేయాలనే ఆలోచన వచ్చింది. దీనికోసం గంటలకొద్దీ ప్రాక్టీస్ చేశా. గంటల తరబడి ప్రాక్టీస్​ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నిద్ర వచ్చినట్టు అనిపించేది కూడా. వాటన్నింటినీ దాటుకుని నేను సక్సెస్ కావడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడింది. రోజూ మెడిటేషన్ చేస్తా. సచిన్ టెండూల్కర్​లా నా రికార్డ్​లు నేనే బ్రేక్ చేయాలనుకున్నా. అది సాధించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది” అన్నాడు వినోద్.

మినీ శాండ్​విచ్!

నదియా మిచౌక్స్ అనే మినియేచర్ ఆర్టిస్ట్​. ఆమె చేతి వేలి గోటి మీద సరిపోయే సైజ్​లో ఫిష్​ ఫింగర్ శాండ్​విచ్​ తయారుచేసింది. గోటిమీద అంటే ఎంత చిన్న సైజ్​లో ఉందో అర్ధమయ్యే ఉంటుంది కదా! దాన్ని తినాలన్నా, చూడాలన్నా మైక్రోస్కోప్​ కావాల్సిందే. అంత చిన్న శాండ్​విచ్​ తయారీకి ఆమెకి వంద గంటల సమయం పట్టిందట. ఈ మినీ శాండ్​విచ్​ పొడవు సెంటిమీటర్ కంటే తక్కువే.

సరిగ్గా చెప్పాలంటే 8 మిల్లీమీటర్ల ఎత్తు.16/15 మిల్లీమీటర్ల వెడల్పు. బరువు ఒక బటానీ గింజంత. దీనిని తయారు చేయించింది  బర్డ్స్ ఐ కంపెనీ. ఇంతకు ముందు టాలెస్ట్ శాండ్​విచ్​  తయారు చేసింది ఈ కంపెనీ.