జపాన్ దేశం.. ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం.. టెక్నాలజీలోనూ అద్భుతం.. ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు వెళుతున్న జపాన్ దేశంలో.. ఇప్పటికీ పాత కాలం నాటి సంప్రదాయ పద్దతులు కొన్ని కొనసాగుతున్నాయనేది చాలా మందికి తెలియదు.. అవును ఇప్పటికి కూడా అక్కడ చాలా మంది ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులు తమ డేటాను ఫ్లాపీల్లో కాపీ చేస్తూ ఉంటారు.. ఫ్లాపీల్లోనే అందజేస్తూ ఉంటారంట.. ఈ విధానికి జపాన్ దేశం పూర్తిగా గుడ్ బై చెప్పింది.
జపాన్ దేశంలో ఇక నుంచి ఫ్లాపీల వినియోగాన్ని రద్దు చేసింది. అందుకు అనుగుణంగా టెక్నాలజీని అప్ డేట్ చేసుకోవాలని ఆయా కంపెనీలకు.. వ్యక్తులకు సమాచారం ఇచ్చింది. ఇక నుంచి ఫ్లాపీ విధానానికి గుడ్ బై చెప్పింది.
అంతేకాదు.. ఫ్యాక్స్ విధానానికి కూడా గుడ్ బై చెప్పనున్నట్లు స్పష్టం చేశారు అక్కడి అధికారులు. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది.. అందుబాటులోకి వచ్చింది. ఈ మెయిల్, వాట్సాప్, వంటి ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు వచ్చాయి.. అందుకే ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాక్స్ చేసే విధానాన్ని కూడా రద్దు చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీని వల్ల ఎంతో ఖర్చు ఆదా అవుతుందని.. పని సులభతరం అవుతుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.