Layoffs : ఫోన్లు చేసి ఉద్యోగాలు పీకేస్తున్న బైజూస్

బైజూస్ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. ఈక్రమంలో సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాని నిర్ణయించుకుంది. దాదాపు 500 మంది ఉద్యోగులను గత 20 రోజులుగా దశల వారిగా తొలగించడం ప్రారంభించింది. అధికారికంగా ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ నుంచి ఎలాంటి  ప్రకటణ రాలేదు. కానీ ఎంప్లాయిస్ కు కాల్ చేసి జాబ్ నుంచి తీసివేస్తున్నట్లు సమాచారం ఇస్తున్నారట. ఉద్యోగాల కోత ప్రభావం బైజూస్ సేల్స్ కార్యకలాపాలు, టీచర్లు, కొన్ని ట్యూషన్ సెంటర్లపై పడుతుంది.  బిజినెస్ లో వచ్చిన నష్టాలను తగ్గించుకునేందకు తీసుకున్న చర్యల్లో ఎంప్లాయిస్ తొలగింపు కూడా ఒకటి. 


ఇప్పటి వరకు దాదాపు 3వేల మంది వరకు జాబ్స్ కోల్పోయారు. అయితే మరో 15,00 మందిని విధుల నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. తాజా తొలగింపులకు సంబంధించి బైజూస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఇప్పటికే బైజూస్ కొందరు పెట్టుబడిదారులతో చట్టపర సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తమ బిజినెస్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు 2023 అక్టోబరులో చేసిన ప్రకటనకు సంబంధించిన ప్రక్రియ చివరి దశలో ఉందని చెప్పాయి. ఖర్చును తగ్గించుకోవడం, నిర్వహణ ప్రక్రియను మరింత సరళీకృతం చేయడంపై దృష్టి పెట్టినట్లు బైజూస్ వర్గాలు తెలిపాయి.

ALSO READ :- Venkatesh-Anil Ravipudi: వెంకీమామ..కేసరి కాంబోకి టైం ఫిక్స్! ట్రిబుల్ డోస్ పక్కా