దేశంలోని అతిపెద్ద ఎల్టిక్ కంపెనీ బైజూస్ ఖర్చులను తగ్గించుకోవడానికి మరో 1,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల కంపెనీలోని సేల్స్, మార్కెటింగ్ టీమ్‌లు ఎక్కువగా తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. $1.2 బిలియన్ల టర్మ్ లోన్ B (TLB)పై సుమారు $40 మిలియన్ల త్రైమాసిక వడ్డీని చెల్లించడంలో బైజు విఫలమైంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక భారం నుంచి బయటపడేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో 1,500 మంది తొలగింపు..
బైజూస్ సంస్థ ఉద్యోగులను తొలగించడం ఇది మొదటిసారి కాదు..ఈ ఏడాది ఫిబ్రవరిలో బైజూస్ 1,500 మంది ఉద్యోగులను తొలగించింది. అంతకుముందు అక్టోబర్ 2022లో ఖర్చులను తగ్గించుకునేందుకు 1000 మందిని తీసేసింది.
బైజూస్ తన లెర్నింగ్ మాడ్యూల్స్‌లో జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టింది. బైజు యొక్క WIZ సూట్ క్రింద కంపెనీ మూడు AI మోడల్స్‌తో కూడిన కొత్త సూట్‌ను ప్రవేశపెట్టింది -- BADRI, Math GPT, TeacherGPT లు విద్యార్థుల అభ్యాస విధానాలను అర్థం చేసుకోవడానికి.. వారి సొంత మెథడాలజీని అభివృద్ధి చేయడంలో ఈ మూడు మోడల్స్ సహాయపడతాయని బైజూ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్ తెలిపారు. AI అమలు ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి ఉద్దేశించినది కాదన్నారు. సంస్థలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ఉపాధ్యాయులు మెరుగైన పనులపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుందని చెప్పారు.