ఫెమా చట్టం ఉల్లంఘించారనే ఆరోపణలతో ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. కంపెనీ క్రైసిస్ కారణంగా నిధులు ఇరుక్కు పోయి జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఫిబ్రవరి నెల జీతాలకోసం ఎదురు చూస్తున్న 20 వేల మంది ఉద్యోగుల నిరాశే మిగులనుంది. బైజూస్ కంపెనీ రైట్స్ ఇస్యూ కారణంగా మార్చి 10 న ఉద్యోగులకు నిధులు చెల్లించాల్సి ఉండగా... వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది.
పెట్టుబడి దారులతో ఉన్న చట్టపరమైన విషయాలను పరిష్కరించే వరకు 250-300 మిలియన్ డాలర్ల వరకు రైట్ ఇస్యూ నుంచి వచ్చే ఆదాయాన్ని వేరు చేయాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (NCLT) బెంగళూరు బెంచ్.. బైజూస్ ని ఆదేశించింది, అయితే ఆ నిధులను ఉపయోగించుకునేందుకు చట్టపరమైన ఆదేశాలు వచ్చినప్పటికీ మార్చి 10 లోపు జీతాలు చెల్లించలేమని బైజూస్ రవీంద్రన్ ఉద్యోగులకు లేఖ రాశారు.
వారాంతంలో బ్యాంకులకు సెలవులు కావడంతో, ప్రస్తుత పరిణామాలతో బైజూస్ .. గడువులోపు జీతాలు చెల్లించే పరిస్థితి లేదని .. కంపెనీ ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ జీతాల చెల్లింపుపై స్పష్టత ఇవ్వలేమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ :- Kaka Cricket Cup Finals.. గ్రాండ్ విక్టరీ విన్నర్ రామగుండం టీమ్
కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలపై వాటాదారులకు బైజూస్ వివరణ ఇచ్చింది. నిధులు దుర్వినియోగం జరగలేదు.. నాన్ యూఎస్ అనుబంధ సంస్థలో 533 మిలియన్ డాలర్ల సంపద ఉందని చెప్పింది. అయినప్పటికీ సంస్థ తక్షణ ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించే పరిస్థితి లేదని ప్రకటించింది.