
జగిత్యాల రూరల్ వెలుగు: ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన 3ఏ ప్లాన్ ప్రకారం హైవే బైపాస్ నిర్మించాలని రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట, గోపాల్‌రావుపేటకు చెందిన రైతులు జగిత్యాల– -ధర్మపురి రహదారిపై ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ కొందరు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్లాన్ మార్చారని ఆరోపించారు. రాత్రి రూరల్ ఎస్సై సధాకర్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. అనంతరం పాత ప్లాన్ ప్రకారమే బైపాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాత్రి రైతులు తమ భూముల వద్ద వంటావార్పు చేసి నిరసన తెలిపారు.