దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల బైపోల్ ఫలితాలు జూలై 13న వెలువడుతున్నాయి. ఇప్పటివరకు ఏడు స్థానాల్లో రిజల్ట్ వెల్లడించింది ఈసీ. బెంగాల్ లోని మూడు చోట్ల టీఎంసీ విజయం సాధించగా.. మణిక్తలాలో ఆధిక్యంలో కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని మూడు స్థానాల్లో ఫలితాలు వెల్లడికాగా.. డెహ్రా, నలగర్ లో కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగిరేసింది. హమీర్ పూర్ లో బీజేపీ గెలుపొందింది. మరోవైపు పంజాబ్ లోని జలందర్ వెస్ట్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మరో ఐదు స్థానాల్లో కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది.
ALSO READ | 7 రాష్ట్రాల్లోని అసెంబ్లీ బైపోల్ రిజల్ట్ : 5 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
ఉత్తరాఖండ్ లోని మంగ్లార్, బద్రీనాథ్ అసెంబ్లీ స్థానాల బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది. బద్రీనాథ్ లో కాంగ్రెస్ అభ్యర్థి లకపతి సింగ్ లీడింగ్ లో ఉన్నారు. మంగ్లార్ లోనూ కాంగ్రెస్ క్యాండెట్ క్వాజీ మహమ్మద్ నిజాముద్ధీన్ ఆధిక్యంలో కొసాగుతున్నారు. బిహార్ లోని రూపాలి లో ఇండిపెండెంట్ అభ్యర్థి శంకర్ సింగ్.. ఎనిమిది వేలకు పైగా లీడింగ్ లో ఉన్నారు.
మరోవైపు మధ్యప్రదేశ్ లోని అమర్వార స్థానంలో బీజేపీ గెలుపుదిశగా పయనిస్తోంది. తమిళనాడులోని విక్రవాండి ఎమ్మెల్యే స్థానంలో డీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది. కాసేపట్లో పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడికానున్నాయి.
ALSO READ | బీజేపీ సర్కారు ఎక్కువ కాలం ఉండదు : మమతా బెనర్జీ