
సీ01 ప్లస్ పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో నోకియా లాంచ్ చేసింది. ఇందులో 5.45 ఇంచుల స్క్రీన్, 5 ఎంపీ బ్యాక్ కెమెరా, 2ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1.6 గిగాహెజ్ అక్టాకోర్ ప్రాసెసర్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. 2జీబీ+16జీబీ వెర్షన్ ధర రూ.ఆరు వేలు. ఇది అండ్రాయిడ్ 11 (గోఎడిషన్) ఓఎస్‌తో పనిచేస్తుంది.