IPL 2025: కోల్‌కతాలో నో కామెంట్రీ: హర్ష భోగ్లే, సైమన్ డౌల్‌లకు బెంగాల్ క్రికెట్ బిగ్ షాక్

IPL 2025: కోల్‌కతాలో నో కామెంట్రీ: హర్ష భోగ్లే, సైమన్ డౌల్‌లకు బెంగాల్ క్రికెట్ బిగ్ షాక్

ఐపీఎల్ 2025 లో టాప్ కామెంటేర్లు హర్ష భోగ్లే, సైమన్ డౌల్‌లకు ఊహించని షాక్ తగిలింది. వీరిద్దరినీ కామెంట్రీ ప్యానల్ నుంచి తొలగించాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI)కి లేఖను పంపింది. ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా సిద్ధం చేయడంలో క్యూరేటర్ సుజన్ ముఖర్జీని భోగ్లే, సైమన్ డౌల్ బహిరంగంగా విమర్శించడంతో వీరిద్దరి మీద చర్యలు తీసుకోవాలని బెంగాల్ క్రికెట్ బీసీసీఐకి కోరింది. 

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ వివాదం మొదలైంది. లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్స్ పిచ్ కేకేఆర్ స్పిన్ బౌలర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలకు అనుకూలంగా లేకపోవడంతో రహానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో లక్నో ఏకంగా 237 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేజింగ్ కేకేఆర్ పోరాడి ఓడింది. పిచ్ క్యూరేటర్ ముఖర్జీ స్పిన్నర్లకు కాకుండా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండే స్పోర్టింగ్ వికెట్‌ను తయారు చేయడంతో హై స్కోరింగ్ గేమ్ మ్యాచ్ జరిగింది. 

Also Read : స్ట్రాటజీ అంటే ఇదే మరి: ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నా

భోగ్లే, డౌల్ ఇద్దరూ రహానేకు మద్దతుగా నిలిచారు. ముఖర్జీకి మద్దతుగా బెంగాల్ క్రికెట్ ముందుకు వచ్చింది. పిచ్ తయారీకి సంబంధించిన  విషయంలో భోగ్లే, డౌల్ జోక్యం చేసుకోవడం బెంగాల్ క్రికెట్ కు నచ్చలేదు. పిచ్ తయారు చేయడం బీసీసీఐ  నియమించిన వేదిక క్యూరేటర్ కిందకు వస్తుంది. అంతేగానీ కామెంట్రీలు భోగ్లే, డౌల్ చేసిన వ్యాఖ్యలు అన్యాయమైనవని క్రికెట్ ఆఫ్ అసోసియేషన్ బెంగాల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. వీరిద్దరిపై చర్య తీసుకోవాలని బీసీసీఐని కోరింది.

CAB లేఖకు బీసీసీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే ఏప్రిల్ 21న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్‌కు భోగ్లే లేదా డౌల్ ఇద్దరూ కామెంట్రీ చేయనట్టు తెలుస్తుంది. ఒకవేళ బీసీసీఐ భోగ్లే, డౌల్ పై చర్యలు  తీసుకుంటే.. మే 23న ఈడెన్ గార్డెన్స్ లో జరగబోయే క్వాలిఫైయర్ 2.. అదే విధంగా మే 25న జరగబోయే ఐపీఎల్ ఫైనల్ కు కామెంట్రీకి దూరం కానున్నారు.