చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ పై అభినందన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. చంద్రయాన్ మిషన్ సక్సెస్ కేవలం ఇస్రో విజయం మాత్రమే కాదు.. ప్రపంచ వేదికపై భారత్ పురోగతికి చిహ్నం అని పేర్కింది.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ కేబినెట్ నిర్ణయాలను వివరిస్తూ.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కృషికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలకు మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపింది. చంద్రయాన్ మిషన్ తో చంద్రుని దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశంగా భారత్ అవతరించిందని కేబినెట్ ప్రశంసించింది.
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఫర్ఫెక్ట్ ల్యాండింగ్ చంద్రయాన్ మిషన్ సాధించిన కీలక విజయం అని.. క్లిష పరిస్థితులను అధిగమించి చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండింగ్ మన శాస్త్రవేత్తలు స్పూర్తికి నిదర్శనం.. శతాబ్దాల కృషి అని.. ఇది చారిత్రకవిజయం అని’’ కేంద్ర మంత్రి అనురాగ్ తీర్మానాన్ని చదివి వినిపించారు.