
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (మార్చి 6) జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 6 గంటలపాటు జరిగినసమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు, నిర్ణయా లు తీసుకన్నారు. మార్చి 12నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
Also Read :- ఐదేళ్లుగా పరిష్కారం కాని సమస్య.. 24గంటల్లో అయ్యింది
రాష్ట్రంలో కొత్తగా 10వేల 950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తరెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూ రు చేసింది. 10 జిల్లాల కోర్టులకు 55 పోస్టులు మంజూరుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.