
ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక(PLI) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీకి పెద్ద పీఠ వేసిన కేంద్రం నిధులు కేటాయిస్తూ పీఎల్ఐ పథకాన్ని శుక్రవారం(మార్చి28) ఆమోదించింది. దిగుమతులు తగ్గించి స్వదేశీ ఎలక్ట్రానిక్స్ సరఫరాను పెంచేందుకు లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. దేశీయంగా బ్యాటరీలు, డిస్ ప్లేలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు( PCB), కెమెరా మాడ్యుల్స్ వంటి కీలకమైన ఎలక్ట్రానిక్ భాగాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ALSO READ | DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 2 శాతం పెంపు
ఎలక్ట్రానిక్స్ రంగంలో 40వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడం, రాబోయే ఐదేళ్లలో 5060 బిలియన్ల డాలర్ల ఉత్పత్తినిపెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ప్రారంభ వ్యయాన్ని రూ.25వేల కోట్లుగా నిర్ణయించింది. పరిశ్రమ డిమాండ్ ఆధారంగా ఈ వ్యయాన్ని పెంచనున్నారు. ఈ స్కీమ్ ను ఇంతకుముందున్న SPECS పథకం స్థానంలో తీసుకువచ్చారు.
దేశీయ ఎలక్ట్రానిక్స్ భాగాలకు ఎగుమతి చేయడం ద్వారా ప్రపంచ మార్కెట్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడం ఈ స్కీం లక్ష్యంగా పెట్టుకున్నారు.