FM Radio channels: మోత మోగనున్న FM రేడియోలు..కొత్తగా 734 చానెల్స్..

FM Radio channels: మోత మోగనున్న FM రేడియోలు..కొత్తగా 734 చానెల్స్..

FM రేడియో ప్రియులకు గుడ్న్యూస్..మీరు FM రేడియో వింటుంటారా..ఇప్పుడు అందుబాటులో ఉన్న కొన్ని  మాత్రమే ఉన్నాయి కదా అని..విన్నవే వినాల్సి వస్తుంది అనుకుంటున్నారా..డోంట్ వర్రీ..మీకోసం వందల్లో కొత్త FM  రేడియో ఛానల్స్ వస్తున్నాయి.దేశవ్యాప్తంగా కొత్తగా 734 ఎఫ్ఎం ఛానళ్లను ఏర్పాటు చేసేందుకు  కేంద్ర కేబినెట్ఆమోదం తెలిపింది.

రూ.784.87 కోట్లతో దేశవ్యాప్తంగా 234 నగరాలు, పట్టణాల్లో 734 FM రేడియో ఛానళ్లను రోల్ అవుట్ చేసేందుుకు కేంద్రప్రభుత్వం ఆమోదించింది. కేంద్రం  నిర్ణయంతో  ఇప్పటివరకు FM రేడియో లో లేని పట్టణాలు, నగరాల్లో ఆ కొరత తీరనుంది. ఈ ప్రైవేట్ FM  రేడియోలు మాతృభాషలో  స్థానిక కంటెంట్‌ను తో రానున్నట్లు తెలుస్తోంది. 

ప్రైవేట్ ఎఫ్ ఎం రేడియో ఫేజ్ ఇల్ పాలసీ కింద 730 ఛానెళ్ల కోసం  మూడో బ్యాచ్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. మాతృభాషలో స్థానిక కంటెంట్ ను పెంచడానికి, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 234 నగరాల్లో జీఎస్టీ  మినహాయింపుతో FM ఛానెల్ వార్షిక లైసెన్స్ ఫీజు రాయితీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.