- రూ. 28,602 కోట్ల పెట్టుబడితో 10 రాష్ట్రాలను కవర్..
- 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు కేబినెట్ ఆమోదం
- నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద స్మార్ట్ సిటీస్ ఏర్పాటు
- ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ లో తెలంగాణకు 1, ఆంధ్రకు 2
- తెలంగాణలోని జహీరాబాద్ లో
- ఆంధ్రప్రదేశ్ లోని ఓర్వకల్లు, కొప్పర్తిలో ఏర్పాటు
న్యూఢిల్లీ:పర్యావరణ వ్యవస్థలో కేంద్రం మరో ముందడుగు..దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీలను నేషనల్ ఇండ స్ట్రి యల్ కారిడార్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్(NIDCP) కింద నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నారు. 6 ప్రధాన కారిడార్ లతో పాటు వ్యూహాత్మకంగా నిర్మిస్తునాన్నారు.
ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం రూ. 28వలే 602 కోట్లు ఖర్చు చేస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డువలప్ మెంట్ ప్రోగ్రం కింద 12 స్మార్ట్ సిటీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఉత్తరాఖండ్ లోని ఖుర్పియా, పంజాబ్ లోని రాజ్పురా పాటియాలా, మహారాష్ట్రలోని డిఘి, కేరళలోని పాలక్కాడ్ , యూపీలో ఆగ్రా, ప్రయాగ్ రాజ్, బీహార్ లోని గయా, తెలంగాణలో జహీరాబాద్, ఏపీలోని ఓర్వకల్, కొప్పర్తి, రాజస్థాన్ లోని జోధ్ పూర్ పాళిలో నిర్మించనున్నారు.
ఈ పారిశ్రామిక హబ్ లలో రూ.1.5లక్షల కోట్ల పెట్టుబడి సామర్థ్యం, ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పొందనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు.