కొనసాగుతున్న కేబినెట్ సమావేశం

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, కట్టడి చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. వైరస్ వ్యాప్తి, కేసుల వివరాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేబినెట్కు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ అదుపులోనే ఉందని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని హరీష్ రావు సీఎం కేసీఆర్ కు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చామని, అర్హులైన వారందరికీ వీలైనంత తొందరగా టీకాలు ఇస్తామని చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. 

ఇదిలా ఉంటే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సాయం తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి వ్యాక్సినేషన్ పై ముందుకెళ్లాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా

యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తాం