
మోదీ కేబినెట్ లో రాష్ట్రం నుంచి ఇద్దరికీ చాన్స్ దక్కింది. సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డికి కేబినెట్ బెర్త్ దక్కింది. ఆయన గతంలోను కేంద్ర మంత్రిగా పని చేశారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా సేవలందించారు. ఇక కరీంనగర్ నుంచి రెండో సారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కు తొలిసారి మోదీ కేబినెట్ లో స్థానం దక్కింది.
ఆయన కేంద్ర సహాయ మంత్రిగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే వీరికి ఏయే శాఖలు కేటా యించారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఎంపీగా విజయం సాధించడం ఇది రెండవ సారి.