కేంద్రమంత్రి పదువులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ కేటాయించగా.. బండి సంజయ్ కుమార్ కు హోంశాఖ సహాయమంత్రి బాధ్యతలు అప్పగించారు. గతంలో ఇదే శాఖను నిర్వహించారు సిహెచ్ విద్యాసాగర్ రావు. కరీంనగర్ ఎంపీలకే రెండు పర్యాయాలు హోంశాఖ సహాయ మంత్రిత్వశాఖే దక్కింది. ఇక 2019లో కిషన్ రెడ్డి హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ లు ఎంపీలుగా ఉన్నారు. కిషన్ రెడ్డికి రెండోసారి కేంద్ర మంత్రి పదవి దక్కగా, బండి సంజయ్ కి తొలిసారి కేంద్రమంత్రిగా ఛాన్స్ దక్కింది.
కాగా ప్రధాని మోదీతో పాటు ఆదివారం 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా.. 36 మంది సహాయ మంత్రులుగా, ఐదుగురు స్వత్రంత్ర మంత్రులు ఉన్నారు. వీరికి తాజాగా కేటాయింపులు జరిపారు.