మోదీ 3.0 కేబినెట్ లో తెలుగు మంత్రులకు శాఖలు ఇవే

మోదీ 3.0 కేబినెట్ లో తెలుగు మంత్రులకు శాఖలు ఇవే

కేంద్రమంత్రి పదువులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ, బండి సంజయ్ కుమార్ కు హోంశాఖ సహాయమంత్రి బాధ్యతలు అప్పగించారు.  శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడుకు పౌరవిమానయాన శాఖను కేటాయించారు.  2014లో ఎన్డీఏలో భాగస్వామైన టీడీపీకి కూడా ఇదే శాఖ దక్కింది. అప్పుడు విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుకు ఇదే శాఖను కేటాయించారు. ఇక శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖల సహాయమంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణ అభివృద్ధి శాఖ,  కమ్యూనికేషన్ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.   

మోదీ 3.0 కేబినెట్ లో పాత మంత్రులుకే కీలక శాఖలు దక్కాయి.  అమిత్‌ షాకు మరోసారి కేంద్ర హోంశాఖ కేటాయించగా...  నితిన్ గడ్కరీకి మళ్లీ రోడ్డు రవాణా శాఖ, రాజ్‌నాథ్‌కు మళ్లీ రక్షణశాఖ, నిర్మలాసీతారామన్‌కు మళ్లీ ఆర్థికశాఖ.. జయశంకర్‌కు మళ్లీ విదేశాంగ శాఖను కట్టబెట్టారు. 

ఇక  మనోహర్‌లాల్‌ కట్టర్‌కు గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, హర్దీప్‌సింగ్‌ పూరి-పెట్రోలియం, అశ్విని వైష్ణవ్‌-రైల్వే, సమాచార, ప్రసారశాఖ, పీయూష్‌ గోయల్‌-వాణిజ్యం, ధర్మేంద్ర ప్రధాన్‌-విద్యాశాఖ, జ్యోతిరాదిత్య సింధియాకు -టెలికాం శాఖ, ప్రహ్లాద్‌ జోషి-ఆహారం, వినియోగదారుల సేవలు, కుమారస్వామి-కి ఉక్కు, భారీ పరిశ్రమలు, సురేష్‌ గోపికి - టూరిజం శాఖ సహాయమంత్రి, రావ్‌ ఇంద్రజిత్‌ సింగ్‌-సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.