సామాజిక న్యాయం అందించడంలో ముందడుగు వేశాం

సామాజిక న్యాయం అందించడంలో ముందడుగు వేశాం

కులగణన రిపోర్టుపై మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అధ్యక్షతన...   క్యాబినెట్​ సబ్​ కమిటి చర్చించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఇలాంటి సర్వే జరగలేదన్నారు. తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం అందించడంలో  ముందడగు వేశామన్నారు. లక్షా 3 వేల 889 మంది సిబ్బందితో కుల గణన చేపట్టామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు.  తెలంగాణలో 3 కోట్ల 70 లక్షల మంది ఉన్నారని.. 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 16 లక్షల మంది పాల్గొనలేదని తెలిపారు.96.9 శాతం కుటుంబాలను సర్వే చేశామన్నారు. ఈ నెల 4 వ తేది క్యాబినెట్​ భేటి ఉంటుందని.. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ఉంటుందన్నారు. సభలో కుల గణన సర్వేపై స్వల్పకాలిక చర్చ ఉంటుందని తెలిపారు. 

ALSO READ | రైతులకు గుడ్​ న్యూస్​: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు విడుదల

తెలంగాణ ప్రజల సోషల్​  స్టేటస్ తెలుసుకొని, సామాజిక ఆర్థిక, విద్య, రాజకీయాల్లో అవకాశాలకు కొరకు ఈ సర్వే నిర్వహించామని మంత్రి ఉత్తమ్​  తెలిపారు. ఈ సర్వేను నిర్వహించేందుకు గాను వివిధ రాష్ట్రాల్లో గతంలో నిర్వహించిన విధివిధానాలు పరిశీలించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ సర్వే.. భారతదేశంలో సామాజిక న్యాయం జరగడంలో గొప్ప విజయమని మంత్రి ఉత్తమ్ అన్నారు.

 తెలంగాణ కులగణన సర్వే   దేశ భవిష్యత్తుకు  ఓ దిక్సూచి అన్న మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి.. ..  ఈ సర్వే చేసేటప్పుడు ప్రభుత్వం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొందన్నారు.  ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. ఏ వర్గం జనాభా ఎంత ఉందో ప్రభుత్వం దగ్గర డేటా ఉందని.. బీసీ జనాభా 46.25 శాతం ఉందని.. సామాజిక న్యాయం కోసమే సర్వే చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ చెప్పుకొచ్చారు.