రిజర్వాయర్లపై కేబినెట్ సబ్ కమిటీ:మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

రిజర్వాయర్లపై కేబినెట్ సబ్ కమిటీ:మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
  • చైర్మన్ గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • సభ్యులుగా తుమ్మల, జూపల్లి
  • ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

హైదరాబాద్:  రాష్ట్రంలోని రిజర్వాయర్ల నిల్వ, సామర్థ్యం, పునరుద్ధరణ తదితర అంశాలపై  కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, జలవనరులు, నదుల అభివృద్ధి గంగా పునరుజ్జీవన శాఖ, జాతీయ ప్రేమ్​వర్క్ పై​ పద్ధతులు, మార్గదర్శకాలను అధ్యయనం, సిఫార్సు చేయడానికి ఈ మంత్రి వర్గ ఉప సంఘం పని చేయనుంది. 

కమిటీకి చైర్మన్ గా భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉంటారు.  ఈ కమిటీ కన్వీనర్, సభ్యుడిగా ఇరిగేషన్ శాఖ కార్యదర్శిని నియమించింది.