- ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అమలుపై వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. శనివారం సెక్రటేరియెట్ లో మంత్రులు ఉత్తమ్, దామోదర ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. పంజాబ్, హర్యానా, తమిళనాడులో వర్గీకరణ అమలుకు ముందు వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు విషయంపై మీటింగ్ లో మంత్రులు ప్రస్తావించారు.
ఈ అంశాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ అమల్లో 2011 ప్రభుత్వ జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని సబ్ కమిటీలో ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.