రైతు భరోసాపై అసెంబ్లీలో రోజంతా చర్చ పెడుతాం: డిప్యూటీ సీఎం భట్టి

రైతు భరోసాపై అసెంబ్లీలో  రోజంతా చర్చ పెడుతాం: డిప్యూటీ సీఎం భట్టి

రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  హనుమకొండ జిల్లాలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో రైతు భరోసాపై రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, కొండా సురేఖ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్బంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతు భరోసాపై రైతులందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు.  వరంగల్ నుంచే రాహుల్ గాంధీ రైతు భరోసా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.    రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు సీఎం యత్నిస్తున్నారని తెలిపారు.  

రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.  రైతు భరోసాపై ప్రతి ఒక్కరి సూచనలు తీసుకుంటున్నామన్నారు.   రైతులకు ఇచ్చిన హామీలపై మాట తప్పబోమన్నారు.  నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం రైతులన్ని నిండా ముంచిందననారు.  గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్యే నిర్ణయాలు తీసుకుందన్నారు.  నిరుద్యోగుల పేరుతో  బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.  అర్హులకే రైతు రైతు భరోసా పథకం వర్తిస్తుందన్నారు.  తమ ప్రభుత్వం ఓపెన్ మైండ్ గా ఉంటుందని.. గత  ప్రభుత్వం అనర్హులకు రైతు బంధు ఇచ్చిందననారు. బీఆర్ఎస్  హయాంలో రైతులకు న్యాయం జరగలేదన్నారు.