అక్టోబర్ నెలాఖరు లోగా కేబుల్ బ్రిడ్జి: దాన కిషోర్

అక్టోబర్ నెలాఖరు లోగా కేబుల్ బ్రిడ్జి: దాన కిషోర్

హైదరాబాద్ లో దుర్గం చెర్వు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు బల్దియా కమిషనర్ దాన కిషోర్, మున్సిపల్ శాఖ సెక్రెటరీ అరవింద్ కుమార్. అక్టోబర్ నెలాఖరు వరకు పనులను పూర్తిచేసి కేబుల్ బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఐటీ హబ్ గా ఉన్న… కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి లో.. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఆకర్షణీయమైన లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు దాన కిషోర్.