కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రారంభించిన నెలకే కేబుల్ బ్రిడ్జికి పగుళ్లు రావడం సిగ్గుచేటని బీజేపీ లీడర్లు ఆరోపించారు. సైడ్వాల్స్, అప్రోచ్ రోడ్డుకు పగుళ్లు రావడాన్ని నిరసిస్తూ శనివారం కేబుల్ బ్రిడ్జి వద్ద బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. లీడర్లు సత్యనారాయణ రావు, ప్రవీణ్ రావు, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ సిటీకి కేబుల్ బ్రిడ్జి మణిహారమని ప్రగల్బాలు పలికిన అధికార పార్టీ లీడర్లు.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతున్నారని ప్రశ్నించారు.
కేబుల్ బ్రిడ్జ్ వద్ద పగుళ్లు, రోడ్డు నిర్మాణ పనులపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లీడర్లు వాసుదేవరెడ్డి, శ్రీనివాస్, ప్రకాశ్, కిరణ్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, సుధాకర్ పటేల్, కల్యాణ్‌చంద్ర, స్వామి, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.